[t4b-ticker]

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి ఒక్కరోజు జైలు శిక్ష

ప్రతిపక్షం,రామగుండం (ప్రతినిధి ), సెప్టెంబర్ 10: రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 8 మందిని ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకట సచిన్ రెడ్డి ముందు హాజరుపరుచగా ఏడుగురికి ₹ 21000 /-ఫైన్ వేయడం మరియు కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా గురువారం స్థానిక ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా దగ్గరలోని గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ₹3000/-నోట్ బుక్స్ ను అందజేశారు. అలాగే ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ఒకరికి ఒక్క రోజు జైలు శిక్ష విధించారు.వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. జరిగింది.అనంతరం సీఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడప రాదని, నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రాంగ్ రూట్లో వెళ్లరాదని,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాన్ని అతివేగంగా నడపరాదని సిఐ బి. రాజేశ్వరరావు తెలిపారు.

Spread the love

Related News

Latest News