ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం మొదలయ్యాయి. నిజామాబాద జిల్లా కేంద్రం లో శుక్రవారం ఉదయం నుండి గణేష్ ప్రతిమలను నిమజ్జనంకు తరలించడం మొదలయ్యాయి. నిజామాబాద్ నగరంలో లోని వినాయక నగర్ గణేష్ నిమజ్జనం బావిలో అనేక సంవత్సరాలుగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేయడం జరుగుతూ వస్తోంది. ఈ మేరకు రెవెన్యూ అంతరాంగం పోలీసు యంత్రాంగం అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఏసిపి ప్రకాష్ యాదవ్, నిమజ్జనం భావి వద్ద గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ వేలాది గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. అలాగే సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక శోభ యాత్ర రథం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు జెండా ఊపి శోభాయాత్ర రథాన్ని ప్రారంభిస్తారు.





























