మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: కానుగు చైర్పర్సన్ రాధిక భూపతిరాజు
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 08: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు మహిళలకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలకు ఉచితంగా చీరల వెంబడి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగా మెదక్ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగినప్పుడే కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.































