రైతుల సహకారంతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.

*నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

*మునుగోడు మండలం సింగారం గ్రామంలో రీ-సర్వే గ్రామ సభకు హాజరైన కలెక్టర్.

*అభ్యంతరాలపై రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం.

ప్రతిపక్షం మునుగోడు నవంబర్ 12 : రైతులందరూ సమన్వయంతో సహకరిస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.గురువారం మునుగోడు మండలం, సింగారం గ్రామంలో భూముల రీ-సర్వేపై జారీ చేసిన నోటీసులకు వచ్చిన అభ్యంతరాల పరిష్కారం కోసం నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన రీ-సర్వే వివరాలను చండూర్ ఆర్డీవో శ్రీదేవి, స్థానిక తహసీల్దార్ కలెక్టర్‌కు వివరించారు. సింగారం గ్రామంలో మొత్తం 255 ఖాతాలు ఉండగా, 417 ల్యాండ్ పార్సెల్ మ్యాపులు (ఎల్‌పీఎం) జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ కంఠం సరిహద్దులు, రహదారులు, పట్టా భూములు, ప్రభుత్వ భూములన్నింటినీ పక్కాగా సర్వే చేసి హద్దులు నిర్ణయించామని, ఈ ప్రక్రియ అనంతరం రైతుల నుండి 59 అభ్యంతరాలు వచ్చాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ సర్వే ద్వారా పాత సమస్యలు పరిష్కారం కావాలే తప్ప, కొత్త సమస్యలు ఉత్పన్నం కాకూడదని అధికారులకు, రైతులకు సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని ఆయన కోరారు

Related News

Latest News