ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 19: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా మెదక్‌ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చనలో పాల్గొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. వనదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రజల జీవితాల్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News