కోసిని గ్రామాన్ని సందర్శించిన కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై జి. సంధ్యారాణి

ప్రతిపక్షం కాగజ్ నగర్ ప్రతినిధి, నవంబర్ 20: కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామాన్ని కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై జి. సంధ్యారాణి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిస్థితులు, ప్రజల సమస్యలు తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కాగజ్‌నగర్ మండల మాలి సంఘం జనరల్ సెక్రటరీ వసాకే హన్మంతు, కోసిని పటేల్ గుర్లే రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై సంధ్యారాణిని ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి జగదీష్, వార్డు మెంబర్ శ్రీనివాస్, సుశీల, గ్రామ పెద్దలు రవి, రామయ్య, తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పోలీసు శాఖకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

Related News

Latest News