టి పి టి ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా” అమ్మన” ఏకగ్రీవ ఎన్నిక

  • హర్షం వ్యక్తం చేసిన టి పి టి ఎఫ్ డబ్బా మండల శాఖ

ప్రతిపక్షం ,దుబ్బాక,నవంబర్ 16: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షునిగా అమ్మన నరసింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల దుబ్బాక మండల శాఖ అధ్యక్షులు జి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జి. రాజు లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దుబ్బాక మండలంలోని ఎంపీపీఎస్ నంబర్-1 పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న నరసింహారెడ్డి 2005లో నాటి ఏపీటీఎఫ్ ఏ పి టి ఎఫ్ లో సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 2011లో దుబ్బాక మండల ప్రధాన కార్యదర్శిగా, 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా, 2017లో జిల్లా కార్యదర్శిగా, 2019 నుండి మొన్నటి వరకు జిల్లా ఉపాధ్యక్షునిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉపాధ్యాయ లోకానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన నిరంతర పోరాట పటిమకు, నిబద్ధతకు గుర్తింపుగా నవంబర్ 14, 2026న జరిగిన జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపికవ్వడం దుబ్బాక మండలానికే గర్వకారణమని పేర్కొన్నారు.

Related News

Latest News