గ్రాడ్యుయేట్ ఓటరు నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

*ప్రతి బూత్ లో అత్యధిక నమోదు చేయాలని బీఎల్ఏ లకు పిలుపు .

*కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.

*సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు మునుగోడు నుండి భారీ మెజారిటీ ఇవ్వాలి

*మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

ప్రతిపక్షం – మునుగోడు అక్టోబర్ 29 : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి బూత్ పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విరివిగా, యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు, బీఎల్ఏలకు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు. తమ పరిధిలో డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ గుర్తించి గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేయాలని సూచించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న దివంగత నేత, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మునుగోడు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.నవంబర్ 6 వరకు జరిగే ఈ ఓటర్ నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్క బీఎల్ఏ చురుకుగా పాల్గొని అత్యధిక ఓటర్లను నమోదు చేయించాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News