పేదింటి విద్యార్థినికి ఎంబీబీఎస్ సీట్ – కృష్ణవేణి స్కూల్ విద్యార్థినికి ఘన సన్మానం

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 02: చండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన విద్యార్థిని నారముల గంగోత్రి ఎంబీబీఎస్ సీటు సాధించి పట్టణానికి, మండలానికి గర్వకారణంగా నిలిచింది. గొల్లగూడెం గ్రామానికి చెందిన గంగోత్రి తండ్రి వెంకటయ్య. ఈమె హైదరాబాద్ లోని హయత్ నగర్ లో గల శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలలో బైపీసీ చదివి, నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించింది. దీంతో నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీస్ సీటు పొందింది.గంగోత్రి విజయాన్ని పురస్కరించుకుని శ్రీ వశిష్ట కళాశాల చైర్మన్ లింగమనేని ప్రమీల విద్యార్థినిని అభినందించారు.

ఈ సందర్భంగా కళాశాల GM వంశీ , డీన్ శ్రీనివాస్ గౌడ్ మరియు AGM విజయ్ ప్రకాశ్ చండూరు పట్టణానికి విచ్చేసి కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గంగోత్రిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ మాట్లాడుతూ… నిరుపేద కుటుంబానికి చెందిన గంగోత్రి మెడికల్ సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని, మా పాఠశాలకు చెందిన విద్యార్థిని సీటు పొందే విధంగా కృషి చేసిన శ్రీ వశిష్ట కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.విద్యార్థిని గంగోత్రి మాట్లాడుతూ.. కళాశాలలో మంచి వాతావరణంతో కూడిన పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రాం ఉండటం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మహబూబ్, చండూరు మార్కెటింగ్ ఇంచార్జ్ పేర్ల గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News