*చండూరు హరిహరపుత్ర ఆలయంలో 100 మందితో మాల ధారణ.
*నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొన్న రాజ్ గోపాల్ రెడ్డి.
ప్రతి పక్షం చండూరు నవంబర్ 14: చండూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అయ్యప్ప దీక్ష (అయ్యప్ప మాల ధారణ) స్వీకరించారు.ఎమ్మెల్యే తో పాటు తన అనుచరులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు 100 మందికి పైగా మాలధారణ తీసుకోవడం జరిగింది.చండూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 14, 15, 16 తేదీలలో విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా చండూరు ఆలయం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా చండూరులో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయాన్ని పరిశీలించి జరగబోయే ఉత్సవాల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.నూతన ఆలయ ప్రతిష్ట సందర్భంగా విగ్రహాల ఊరేగింపు క్రతువులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
































