అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు శ్రీ దేవసేన

*ఓటరు జాబితాలో అర్హులెవరూ మిస్ కావొద్దు – శ్రీ దేవసేన
*సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలదే కీలక పాత్ర: జిల్లా పరిశీలకురాలు
*నవంబర్ 5 వరకు అభ్యంతరాల పరిష్కారం – 9న తుది ఓటరు జాబితా విడుదల
*సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం – చండూరు ఆర్డీఓ కార్యాలయంలో లో సమీక్ష

ప్రతిపక్షం – చండూరు / మునుగోడు, అక్టోబర్ 27: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర చాలా ముఖ్యమని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు.మంగళవారం చండూరు ఆర్డీవో, మునుగోడు ఈఆర్వో కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ (SIR) ప్రక్రియపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

*నవంబర్ 5 వరకు అభ్యంతరాల పరిష్కారం
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం సర్ ఫారాలపై వచ్చిన అభ్యంతరాలను నవంబర్ 5 వరకు పరిష్కరించేందుకు అవకాశం ఉందని, అర్హులైన వారందరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేసేలా చూడాలని, బీఎల్ఏలను వెంటనే నియమించాలని పార్టీలను కోరారు.

*మునుగోడులో పకడ్బందీగా సర్ – పార్టీల ప్రశంస
మునుగోడులో సర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగిందని, ఈఆర్వో, ఆర్డీవో తమ సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చారని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభినందించారు.

*తుది జాబితా నవంబర్ 9న – కలెక్టర్
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో అన్ని హియరింగ్స్ పూర్తి చేశామని, ఫారం 6,7,7ఏ పరిశీలించామని, అన్ కలెక్టెడ్ ఫారాలను బీఎల్ఏల సమక్షంలో పరిశీలించామని, నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అనంతరం ఆమె జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షించి, రికార్డుల నిర్వహణ, బీఎల్ఓ యాప్ నమోదు, డబుల్ ఎంట్రీ ఓటర్ల తనిఖీపై ఆదేశాలు ఇచ్చారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News