మెదక్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతే లక్ష్యం

ప్రతిరోజు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అల్పాహార కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాల్లో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న మొత్తం 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో అల్పాహార మెనూను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఉదయం వేళ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు దూరమై డ్రాప్‌అవుట్ కాకుండా, సరైన సమయానికి పాఠశాలకు చేరుకునేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రి అన్నారు. విద్యార్థులు ఆకలితో కాకుండా ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా పాఠశాలకు హాజరై చదువుపై దృష్టి సారించేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరిగి, వారి ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌరవ చంద్రదాస్. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు. వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్ మున్సిపల్ కౌన్సిలర్లు రాణి బాలరాజ్. సంధ్యా నవీన్. గంట సంపత్.రాజశేఖర్. కాంగ్రెస్ నాయకులు రాగి అశోక్ బొజ్జ పవన్ కాంగ్రెస్ నాయకులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News