బాలికల గురుకుల పాఠశాలలో ప్రమాదకరంగా మారిన వాటర్ ట్యాంక్ తొలగింపు.

*చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తక్షణ చర్యలు.

ప్రతిపక్షం చౌటుప్పల్ అక్టోబర్ 28: మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదర్శాలతో, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు.చౌటుప్పల్‌లోని స్థానిక బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉంటూ, విద్యార్థినులకు ప్రమాదకరంగా మారిన వాటర్ హౌస్ సంపు (ట్యాంక్)ను తొలగించాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను విన్న వెంటనే సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ , మున్సిపల్ సిబ్బందిని పురమాయించి ఆ నిరుపయోగ ట్యాంక్‌ను వెంటనే యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. అనంతరం ఆ ప్రాంతమంతటా చుట్టుపక్కల పరిసరాలను శుభ్రపరిచి విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.

విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, తాము అడగ్గానే స్పందించి సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు చైర్‌పర్సన్ కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ: “పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత లేదా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో విద్యాసంస్థల్లోని సమస్యల పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ ముందుంటాం. విద్యార్థినులంతా ఎలాంటి ఆందోళనలు లేకుండా, సురక్షితమైన వాతావరణంలో చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మన ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News