*ప్రజా ఉద్యమాల యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి ఘన నివాళులు.
*సురవరం సేవలను ఘనంగా స్మరించిన సిపిఐ శ్రేణులు
ప్రతి పక్షం చండూరు ఆగస్టు 22: సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా చండూరు మండలం కస్తాల గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సూరవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి, సేవలను ఘనంగా గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నాయకుడి నుండి జాతీయ నాయకుడిగా AISF విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గా (2012-2019) వరకు ఎదిగిన అరుదైన నాయకుడు అని కొనియాడారు.నల్గొండ గొంతుకగా పార్లమెంట్ లో 1998, 2004 లో నల్గొండ ఎంపీగా గెలిచి, ఫ్లోరైడ్ సమస్య, కృష్ణా జలాలు, రైతు సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తారు.
పత్రికా రంగంలో సిపిఐ అధికార పత్రిక జనశక్తి సంపాదకుడిగా, పేద ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చారు అని అన్నారు.భూమి, భుక్తి, విముక్తి కోసం, ప్రజా పంపిణీ వ్యవస్థ, కార్మిక హక్కుల కోసం జీవితాంతం పోరాడారు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
అంతకుముందు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు గంట రమేష్, కస్తాల సర్పంచ్ లేదన్న సత్యం, ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ, ప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి గంట నగేష్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్, సీనియర్ నాయకులు కట్ట యాదగిరి, కట్ట నారయ్య, గంట రామచంద్రం, బొమ్మరబోయిన శ్రీను, పగిళ్ల వెంకన్న, ఆకారపు వెంకన్న, ఆకారపు కృష్ణ, అద్దంకి సైదులు, కట్ట యాదయ్య, ఎర్రజల్లి పిచ్చయ్య, యువజన నాయకులు కట్ట రోహిత్, బొమ్మరబోయిన చందు తదితరులు పాల్గొన్నారు.





























