పెరుగుతున్న “ఆస్టియోపోరోసిస్” సమస్య

ప్రతిపక్షం, సెప్టెంబర్ 25: ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారడం) అనేది ఎముకల సాంద్రత తగ్గిపోయి, అవి పెళుసుగా మరియు బలహీనంగా మారే ఒక ఆరోగ్య సమస్య.చెద తొలిచిన కొమ్మలా ఎముకలు లోపల బోలుగా మారుతాయి. దీనివల్ల చిన్నపాటి దెబ్బ తగిలినా లేదా పడిపోయినా ఎముకలు సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది. దీనిని వైద్య రంగంలో ‘సైలెంట్ కిల్లర్ డిసీజ్’ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎముకలు విరిగే వరకు సాధారణంగా ఎలాంటి ముందస్తు లక్షణాలు బయటపడవు..
ఆ దెబ్బకు ఎముకలు బలహీనపడి, పెళుసుబారిపోతాయి. గాజు కంటే కూడా సుకుమారంగా మారిపోతాయి. వంగినా, దగ్గినా.. ఫట్టున విరిగిపోవచ్చు. తుంటి భాగంలో, మణికట్టులో, వెన్నెముకలో చిన్నాపెద్దా పగుళ్లు రావచ్చు.
ఎముకల నొప్పులను సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎముకలు బలహీనపడడం వల్ల కీళ్ల మధ్య కార్టిలేజ్‌ అరిగిపోయి, మోకాళ్ల నొప్పులు, తుంటి నొప్పి, వెన్ను, నడుము నొప్పులు మొదలవుతాయి.ఇది ఆస్టియొపొరొసిస్‌ ముందరి దశ. దీన్ని ఆస్టియొపీనియా అని అంటారు. ఈ దశలోనే జాగ్రత్తపడితే ఎముకలు పూర్తిగా గుల్లబారిపోయే ఆస్టియొపొరొసిస్‌ దశకు చేరకుండా నియంత్రించుకోవచ్చు. అయితే ఎముకలను పటిష్ఠంగా ఉంచుకోవాలంటే, ప్రతి ఒక్కరూ అందుకు తోడ్పడే అంశాల గురించి కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి.

ఎత్తు తగ్గటం :

వైద్య పరీక్షలకు వెళ్లినప్పుడు హఠాత్తుగా ఎత్తు తగ్గినట్టు తేలిందా? దీన్ని తేలికగా తీసుకోవద్దు వెన్నెముక క్షీణించటం, పూసల మధ్య ఖాళీ తగ్గటం వల్ల సుమారు 2-3 సెం.మీ ఎత్తు తగ్గే అవకాశం ఉంటుంది..

ముందుకు వంగటం :

అద్దంలో చూసుకున్నప్పుడు ముందుకు వంగినట్టు అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు. భుజాల వద్ద వెన్నెముక ముందుకు వంగటమనేది కేవలం అందం, కూర్చునే తీరుకు మాత్రమే సంకేతం కాదు. వెన్నెముక బలహీన పడుతోందనడానికి, శరీరం తిన్నగా ఉండటానికి తగినంత దన్నుగా ఉండటం లేదనటానికి బలమైన సూచిక

హఠాత్తుగా వెన్నునొప్పి :

చాలామంది పరుపు సరిగా లేకపోవటమో, కండరాలు బెణకటం వల్లనో వెన్నునొప్పి వచ్చి ఉండొచ్చని భావిస్తుంటారు. అయితే, నొప్పి పొడుస్తున్నట్టు ఉన్నా, నడుస్తుంటే లేదా నిల్చుంటే తీవ్రమవుతున్నా, పడుకున్నప్పుడు కాస్త తగ్గుతున్నా సందేహించేలీ..

ముఖ్య సూచిక:

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, ముఖ్యంగా, 50 ఏళ్లు దాటినట్టయితే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవటం మంచిది..తక్షణమే మీ వ్యక్తిగత వైద్యుడుని సంప్రదించాలీ.

Spread the love

Related News