ప్రతిపక్షం, ఆగస్టు 06, ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కోత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా ఖమ్మం విద్యుత్ శాఖ ఉద్యోగులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ రాష్ట్ర నేత బాదావత్ బాబు నాయక్, డి.ఇ. సి.హెచ్. నాగేశ్వరరావు, డి.ఇ.ట్రాన్స్ కో యం.రాధాకృష్ణ, ఎస్.సీ. ట్రాన్స్ కో వి. రాంబాబు, డి.ఇ.వైరా వై. రమేష్, ఎస్.సీ. ఇ. శ్రీనివాసచారి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మేధావిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
అనంతరం జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీ.ఇ.ఇ.ఏ. ఖమ్మం బ్రాంచ్ ప్రతినిధులు టి.జీ. ట్రాన్స్ కో మరియు టీ.జి.ఎన్.పి.డిసి.ఎల్. అధికారులు ఇంజనీర్లు ఉద్యోగులు జి.మధు, ఏ.ఇ., డి. సాంబశివరావు ఏ.డీ., ఎన్.నాగరత్నమ్మ డీ.ఇ., యం. సతీష్ ఏ.డీ.ఇ., జి.కవిత ఏ.డీ.ఇ., రాకేష్ ఏ.డీ.ఇ తదితరులు పాల్గొన్నారు.



















