ఆఫీసులో గంటకోసారి ఇలా చేస్తే..

ప్రతిపక్షం, జూలై 24: రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే ఉద్యోగులు ప్రతి గంటకు కనీసం ఐదు నిమిషాలు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోధనలో సుమారు 19,300 మంది ఉద్యోగుల ఆరోగ్య వివరాలను విశ్లేషించగా, ఎక్కువసేపు నిరంతరంగా కూర్చోవడం శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది. అలాగే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం పెరగడంతో పాటు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచించారు.

Spread the love

Related News

Latest News