[t4b-ticker]

పెళ్లి కావడం లేదని 29 మంది యువకుల ఆత్మహత్య

ప్రతిపక్షం, జూలై 29: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు జిల్లాలో మొత్తం 443 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీసుల సర్వేలో వెల్లడైంది. వీరిలో 29 మంది యువకులు పెళ్లి కాలేదనే మనస్తాపంతోనే ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించారు.

పెళ్లి ఆలస్యం కావడం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి, కుటుంబ సభ్యుల ప్రశ్నలు, ఒంటరితనం, మానసిక వేదన వంటి అంశాలు ఈ విషాద ఘటనలకు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలు యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.

మానసిక నిపుణుల సూచన ప్రకారం, వివాహం ఆలస్యం కావడం జీవితానికి ముగింపు కాదని, అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు భావోద్వేగపరమైన అండగా నిలవడం అత్యంత అవసరమని పేర్కొంటున్నారు.

Spread the love

Related News

Latest News