రైతులందరికీ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలీ: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

అగ్రి స్టాక్ ద్వారా రైతుల భూములు, పంటల వివరాలను డిజిటలైజేషన్ చేయాలి.

వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతు సంఘాల ద్వారా సద్వినియోగం చేసుకోవాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉంచాలి.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్ 30: రైతుల సమగ్ర వివరాల సేకరణలో భాగంగా ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఆదేశించారు. అగ్రి స్టాక్, వ్యవసాయ యాంత్రీకరణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ ఏర్పాట్ల పై శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌,లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, పాల్గొని సంబంధిత శాఖల అధికా రులతో సమీక్షించారు.జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయ్యేలా అధికా రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని సూచించారు. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటే ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ, వ్యవసాయ పథకాలను అర్హులైన రైతులకు సమర్థవంతంగా అందించేందుకు వీలవు తుందని తెలిపారు.

ప్రతి రైతుకు సంబంధించిన భూములను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు, రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ డేటా ఆధారంగా ఏ ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంది, ఏ మండలాల్లో ఏయే పంటల ను ప్రోత్సహించవచ్చు అనే అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.అలాగే “వీబీజీ రామ్ జీ” పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు, ముఖ్యంగా భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి సంరక్షణకు అవసర మైన పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టేందుకు ఈ సమాచారం ఉపయోగప డుతుందని కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వమే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసేదని, ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, యంత్రాల కొనుగోలు బాధ్యత సంబంధిత సంఘాల పైనే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా రైతులు సంఘాలుగా ఏర్పడి పరికరాలను వినియోగించు కునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ప్రతి నియోజక వర్గానికి కనీసం ఒక పీ.ఏ సీ.ఎస్‌, ను ఎంపిక చేసి, వాటి ద్వారా సీహెచ్‌సీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లక్ష్యం నెరవేరేలా అర్హులైన రైతు సంఘాలను గుర్తించి, యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా సిద్ధం చేయాలి.
ధాన్యం కోతలు వేగవంత మవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధాన్యానికి మంచి ధర లభిస్తుండటం తో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద పంటను విక్రయిస్తున్నారని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో కోతలు మరింత పెరిగి ఒకేసారి పెద్ద మొత్తంలో ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని పేర్కొ న్నారు. ఆ సమయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటే ప్రైవేట్ మార్కెట్‌లో కూడా పోటీ ధరలు లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోతే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల ప్రయో జనాలను కాపాడేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన గోనె సంచులు, వేయింగ్ యంత్రా లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు తదితర సామగ్రిని పూర్తిస్థా యిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ముందుగా నే సమకూర్చుకోవాలని, రైతులకు సకాలంలో సేవలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశం లో అగ్రికల్చరల్, హార్టికల్చర్, సహకార, మార్కెటింగ్, డి ఆర్.డి.ఏ., వెటర్నరీ, సివిల్ సప్లై శాఖల జిల్లా అధికా రులు నాబార్డ్ ప్రతినిధి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News