నవాబు పేట దళితులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 26: బతుకమ్మ వేడుకలలో నవాబుపేట దళితులపై దాడి చేసిన గ్రామ ఉపసర్పంచ్ ఇతర నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబుపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో దాడికి గురైన బాధితులను సోమవారం నాడు కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నారు.అనంతరం సంఘటనపై విచారణకు వచ్చిన తూప్రాన్ డిఎస్పి నీ కలిసి దళితులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నాడు గ్రామానికి చెందిన దళితుడైన సాయిలు తన కొడుకు సన్నీ మరో ముగ్గురు తో కలిసి డప్పు కొట్టడానికి వెళ్లగా గ్రామ ఉప సర్పంచ్ హరి గౌడ్,రవి గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డిలు దళితుడైన సాయిలును నాలుగు డప్పులు ఎందుకు వచ్చాయని బూతులు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని శంకర్ తెలిపారు.

తన తండ్రిని కొడుతున్నారని సన్నీ వెళ్లి అడ్డుకోగా సన్నీ నీ గొంతు పిసికీ హత్య యత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. అదే రోజు రాత్రి బాధితులు శివంపేట పోలీస్ ల కు ఫిర్యాదు చేయగా వారం రోజులు తర్వాత కేసు నమోదు చేశారాని తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి సైతం తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.తూప్రాన్ డీఎస్ పి పరిధి నవాబుపేట, పీ టి కోనా యా పల్లి, కు చారం దళితులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నవాబుపేట, పీ టి కోనాయిపల్లి కేసులను హత్య యత్నం కేసులు గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిబి ఎఫ్ జిల్లా నాయకులు పంచమి చంద్రం, నరసింహులు, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీ, ఎల్లేష్, దొంతి నరసింహులు, నందు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News