ప్రతిపక్షం, అక్టోబర్ 17: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్న మల్లయ్య గారికి 94 వ జయంతి సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం, వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, బీఎస్పీ పార్టీ నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఆయన ప్రజల మనిషి , బహుజనుల నాయకుడని కొరియాడారు. బొమ్మన పల్లె సర్పంచ్ గా 21 సంవత్సరాలు, ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 4, పర్యాయాలు గెలిచి అన్ని వర్గాలకు కృషి చేయడం జరిగింది. ఆయనను పేదల ఆశాజ్యోతి గా ఇక్కడి ప్రజలు స్మరించుకుంటారు. అసెంబ్లీకి ఆటోలో, బస్సుల లో వెళ్లిన సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలు స్మరించుకుంటారు. ఆయన చరిత్రలో ఒక పేజీ సృష్టించుకున్నాడని తెలియజేయడం జరుగుతుంది.
గౌరవెల్లి ప్రాజెక్టు ,వరద కాలువ కొట్లాడిన వ్యక్తి అని దేశిని చిన్న మల్లయ్య అని CPI నాయకులు కోయడ కొమరయ్య మాట్లాడారు. నిజాయితీకి , క్రమశిక్షణకు దేశిని చిన్న మల్లయ్య మారుపేరని, ప్రస్తుత రాజకీయాలలో అయినలాంటి వారిని చూడలేమని కౌన్సిలర్ గాదపాక రవీందర్ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, గౌడ సంఘం నాయకులు మార్క అనిల్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించిన గద్దె వద్ద వెంటనే దేశిని చిన్న మల్లయ్య విగ్రహం ప్రతిస్థాపించాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గంపల శ్రీనివాస్ మాట్లాడుతూ 95వ జయంతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పరిచే ఆయన విగ్రహం వద్ద వచ్చే సంవత్సరం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి చేయాలని జరిగింది. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గాదపాక రవీందర్, సిపిఐ నాయకులు కోయడ కొమరయ్య, అక్బర్ , పాష, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్క అనిల్ గౌడ్, గంపల శ్రీనివాస్, పరుశురాములు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు గడిపే కొమురయ్య, బుర్ర వెంకన్న గౌడ్, బిఎస్పి పార్టీ అధ్యక్షులు వెలుపుల రాజు, మొగిలిపాక శీను, మేదర సంఘం నాయకులు ప్రతాపగిరి శ్రీనివాస్, పాలెపూ కనకయ్య, పోలోజు సదానందం, సుంకరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.





























