- పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – అంతంపేట సర్పంచ్ శ్రీలత వెంకటేశం.
ప్రతి పక్షం గట్టుపల్ నవంబర్ 23: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) పేద ప్రజలకు ఒక వరంలా మారిందని గట్టుపల్ మండలం అంతంపేట గ్రామ నాయకులు అన్నారు.అంతంపేట గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు చెక్కులు మంజూరయ్యాయి.మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను గ్రామ సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లెంకలపల్లి శంకరాచారి, మాజీ సర్పంచ్ మాదగోని శేఖర్ గౌడ్ లు లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులు నేనావత్ నరేందర్, అనిమల్ల వెంకటయ్య, నేనావత్ జమ్ము, నేనావత్ మారమ్మ గారికి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 2వ వార్డు సభ్యులు లెంకలపల్లి రాఘవేంద్ర చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదగోని సుధాకర్, అనిమల్ల శంకర్, మాదగోని వెంకటేష్, కర్ణేకంటి ఈశ్వర చారి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
























