— జిల్లా అడిషనల్ కలెక్టర్, ఎన్. ప్రసునాంబ.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్ 16: ప్రతి విద్యార్థికి ఎన్నికలపై మరియు ఓటర్ల జాబితా పై అవగాహన ఉండాలని జిల్లా ఎడిషన్ కలెక్టర్ ప్రసూనాంబ తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ లో ఎలెక్టోరల్ లిటరసీ క్లబ్ ల జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఓటు హక్కు ప్రజాస్వామ్యం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని విద్యార్థులకు క్విజ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి రమేష్, మండల విద్యాధికారి చంద్రకళ, జగిత్యాల అర్బన్ మరియు రూరల్ తాసిల్దారులు రామ్మోహన్, హకీమ్, పి. ఆర్. టి. యు. టి. ఎస్. జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినిపెల్లి ఆనంద్ రావు, కార్యక్రమ నిర్వాహకులు రాజశేఖర్, శివ ప్రసాద్, శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.





























