సీఎం రేవంత్ రెడ్డి పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం.

శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి.

ప్రతిపక్షం, కొమురవెల్లి, నవంబర్ 12: సీఎం రేవంత్ రెడ్డి పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనదని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామిని తన పుట్టినరోజు సందర్బంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామి లడ్డు ప్రసాదం అందజేసి శాలువ కప్పి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికి కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేసి శాలువాలతో, పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. .ఈ సందర్భంగా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జనగామ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాఫ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు భారీగా తరలిరావాలని అన్నారు.తన పుట్టినరోజు సందర్భంగా కొమురవెల్లి మల్లన్న స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రైతన్నలకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొమురవెల్లి మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News