అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి

బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో లబ్ధిదారుల పేర్ల తొలగింపుపై కలెక్టర్‌కు పద్మా దేవేందర్ రెడ్డి ఫిర్యాదు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 23: మెదక్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లను తొలగిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి 2BHK ఇళ్ల పట్టాలు కేటాయిస్తున్నారని ఆమె విమర్శించారు.ఈ విషయంపై సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను రాజకీయాలకు అతీతంగా నిజమైన అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరారు. అర్హులైన పేదలకు న్యాయం చేయకపోతే మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు ఆంజనేయులు బట్టి ఉదయ్ జుబేర. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Related News

Latest News