[t4b-ticker]

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: వెంకటేష్ గౌడ్

ప్రతిపక్షం శేర్లింగంపల్లి సెప్టెంబర్ 20: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ , శంషిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో , వినాయక కమిటీ సభ్యులు, కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు, భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ, శంషిగూడ డివిజన్ ప్రజలందరూ వినాయక చవితి పండుగను కలిసి కట్టుగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వినాయక కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News