బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ,
గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
ప్రతిపక్షం శేరిలింగంపల్లి సెప్టెంబర్ 20: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో తుల్జా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ,గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ఏర్పాటుచేసిన నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.హైదరాబాద్ నగరంలో యువత అంతా ఐక్యంగా ఉండి ఘనంగా నిర్వహించే పండుగ వినాయక నవరాత్రి వేడుకలని, గణపయ్య నిమజ్జనం అనేది ముగింపు కాదని కొత్త ఆరంభానికి సంకేతమన్నారు.
నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా అన్ని చెరువుల వద్ద పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు సాగాలని కోరారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని మొదటి లడ్డూను ₹2,05,000కు కైవసం చేసుకున్న గోపనపల్లి తండా వాసి ప్రకాష్ నాయక్ , 2వ లడ్డూను ₹1,10,000కు కైవసం చేసుకున్న గోపనపల్లి తండా వాసి కృష్ణ నాయక్ కు గంగాధర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,స్థానిక నేతలు, భక్తులు,మహిళలు, పిల్లలు,కాలనీ వాసులు, కార్యకర్తలు,గణేష్ మండపాల నిర్వహకులు,గణేశ భక్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






























