[t4b-ticker]

చెత్త సేకరణకు కొత్త ట్రైసైకిళ్లు

  • ఫాగ్ మిషన్ల అందుబాటులోకి.. డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం
  • రూ .17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్లు: కేంద్ర మంత్రి బండి సంజయ్

ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 20: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కొత్తగా కొనుగోలు చేసిన ట్రైసైకిళ్లు, ఫాగ్ మిషన్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి శానిటేషన్ సిబ్బందికి వాటిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్‌కు ఒక ట్రైసైకిల్‌ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నామని తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అదనంగా ట్రాక్టర్లను కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

నగరంలో చాలాకాలంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. మరో రూ.80 కోట్ల యూసీఎఫ్ నిధులతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మరో రూ.16 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పనులను ప్రారంభించబోతున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

Spread the love

Related News

Latest News