జీతేందర్రెడ్డితో భేటీ అయిన జిల్లా ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్‌నేత ఏపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరే విషయం దాదాపుగా ఖాయం అయినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ ఆశించిన ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ సైతం ఆయనకు టికెట్ నిరాకరించింది. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న ఆయనను సీఎం రవేంత్‌రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీ పాలమూరు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గత అయిదేళ్లు, మళ్లీ అయిదేళ్లు ఇలా ఉత్తగ ఉంటే రాజకీయ భవిష్యత్ ఏమిటన్న దానిపై ఆయన సమాలోచనల్లో పడ్డారు. దీంతో కాంగ్రెస్‌లో చేరాలని ఆయన అనుచరులు కోరుతున్నారని, త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.