Trending Now

రేవంత్ విర్రవీగే మాటలు మానుకో: ఈశ్వర్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతతంగా మాట్లాడాలని, కానీ విర్రవీగే మాటలు మాట్లాడుతున్నారని, త్వరలోనే ఈ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గత సీఎం కేసీఆర్ తప్పు చేసినట్లు చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఎంక్వైరీల పేరుతో గత పథకాలు ఎగ్గొడుతున్నారన్నారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ ఆపేశారని మండిపడ్డారు. ఇస్తరో ఇవ్వరో ఆ వర్గాలకు సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం చిల్లరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భాషపై క్రిమినల్ కేసుపెట్టి జైల్‌కు పంపాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రేవంత్​రెడ్డి పొగరుబోతు మాటలు మానుకోవాలని, లేకుంటే ప్రజలే ఆయన నాలుకను కోసేస్తారనిహెచ్చరించారు.

Spread the love

Related News

Latest News