హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని త్వరిత గతిన అభివృద్ధి చేయాలని, ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సోమవారం నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. సమీక్ష. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు అధికారులు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశం.
నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి దానం కిషోర్‌ను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి అధికారులు, టౌన్ప్లానింగ్అధికారులతో పాటు సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.