Trending Now

దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త విధానం..

డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు..

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో హైదరాబాద్, మార్చి 21: అన్ రిజర్వ్​డ్​ రైల్వే టికెట్ల కొనుగోలును దక్షిణమధ్య రైల్వే మరింత సులభతరం చేసింది. క్యూఆర్​ కోడ్​ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోన్​ పే, గూగుల్​ పే తదితర పేమెంట్​ యాప్​ ల సహాయంతో టికెట్లను కొనుగోలు చేసే విధానాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టింది. తొలిదశలో సికింద్రాబాద్​ డివిజన్​ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో ఈ సౌకర్యం ప్రవేశపెట్టింది. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు నగదు లావాదేవీల సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి దక్షిణమధ్య రైల్వే డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నది.

అదేవిధంగా టికెట్లకు సరిపడా చిల్లర సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్తగా శ్రీకారం చుట్టిన ఈ విధానంలో కౌంటర్ల వద్ద ప్రయాణీకుల గమ్యస్థానాలతో కూడిన చార్జీల వివరాలు ఉంచబడుతాయి. ఇందులో బయలుదేరే స్టేషన్​, చేరుకునే స్టేషన్​, ప్రయాణపు తరగతి వివరాలు, పెద్దలు లేదా పిల్లలు,టికెట్ల సంఖ్య తెలిపే వివరాల చార్జీలు ఉంటాయి. వీటితోపాటు క్యూ ఆర్​ కోడ్​ కూడా డిస్​ ప్లే బోర్డులో కనిపిస్తుంది. ప్రయాణీకులు తమ మొబైల్​ ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్​ ద్వారా దీనిని స్కాన్​ చేసి, చార్జి చెల్లించిన వెంటనే టికెట్​ జనరేట్​ అవుతుంది. తొలిదశలో భాగంగా సికింద్రాబాద్​ డివిజన్​ లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటి, జేమ్స్​స్ట్రీట్​, మహబూబాబాద్​, బెల్లంపల్లి, సిర్పూర్​ కాగజ్​ నగర్​, వికారాబాద్​ స్టేషన్లలో క్యూ ఆర్​ కోడ్​ ద్వారా అన్​ రిజర్వ్​ డ్​ టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు.

Spread the love

Related News

Latest News