Contact info
#8-2-596/3, 2nd Floor, Road No.10, Banjarahills,
Hyderabad, Telangana- 500034,
Ph: 040-43902732, Cell: 9912199844
email:[email protected]
PRATHIPAKSHAM (c) 2024. All Rights Reserved for ARA Publications. Designed & hosted by Hyderabad Graphics
‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్‌గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్‌పథ్‌లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.
Related News
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ
వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు
ఓపెన్ స్కూల్ సొసైటీలో ‘కోటి’ పైగా స్వాహా!
గంజాయి బ్యాచ్‌కు చుక్కలే
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం
‘జూబ్లీ’ ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటాం
ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు
గ్రామగ్రామాన సంబరాలు చేయండి
కాంగ్రెస్ ‘జూబ్లీ’ విజయం
జూబ్లీహిల్స్ ప్రజలు.. ప్రజా పాలన వైపే: మంత్రి పొన్నం
కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలం… పోలీసుల అత్యుత్సాహం
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక.. 10 వేల ఆధిక్యంలో కాంగ్రెస్
ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి
అందెశ్రీ మరణం సాహితీ రంగానికి తీరని లోటు
అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం దిగ్భ్రాంతి
చర్చలు సఫలం… సోమవారం నుండి కాలేజీలు షురూ
కలెక్టర్ ఇదేంటీ? 46 మైసమ్మ గుళ్లు కూల్చేస్తారా ?
Latest News
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ
వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు
ఓపెన్ స్కూల్ సొసైటీలో ‘కోటి’ పైగా స్వాహా!
గంజాయి బ్యాచ్‌కు చుక్కలే
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం
‘జూబ్లీ’ ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటాం
ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు
గ్రామగ్రామాన సంబరాలు చేయండి
కాంగ్రెస్ ‘జూబ్లీ’ విజయం
జూబ్లీహిల్స్ ప్రజలు.. ప్రజా పాలన వైపే: మంత్రి పొన్నం
కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలం… పోలీసుల అత్యుత్సాహం