ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉందని అభిప్రాయపడ్డారు. సమసమాజ స్థాపనకు అల్లూరి చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆయన ట్వీట్ చేశారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామం లో మహోజ్వల శక్తి గా వెలుగొందిన శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. సమసమాజ స్థాపనకు శ్రీ… pic.twitter.com/vSCS2Rktpk
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2024