Trending Now

ఏజెన్సీ చట్టాలను సవరణ చేయాలి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు గుడిసె దేవనంద్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాను ఆదేశాల మేరకు ఖానాపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గోళ్ళ రాజమల్లు, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపి ఎస్సీ, ఎస్టీలకు తగు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కుల గణన కార్యక్రమాన్ని స్వాగతిస్తూ.. కుల గణన చేస్తున్న సందర్భంలో కులాల ఆధారంగా మెజారిటీగా ఉన్న సామాజిక వర్గాల జనాభా ప్రాతిపదిక గ్రామపంచాయతీలో రిజర్వేషన్ కేటాయించాలని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ కేటాయించారని తెలిపారు. కానీ 2019 పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఏజెన్సీ గ్రామ పంచాయితీలలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ తొలగించారని,వెంటనే అట్టి ఏజెన్సీలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ మళ్లీ కేటాయించాలని అన్నారు. ఏజెన్సీ గ్రామ పంచాయతీలలో గిరిజనలు మొత్తం లేని గ్రామాలు చాలా ఉన్నాయి.

అక్కడ పంచాయతీ ఎన్నికలు లేక అభివృద్ధి కి నోచుకోలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీలకే కేటాయించాలి. లేదా ఏజెన్సీని ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో గిరిజనులు 80 90% ఉన్నా కూడా అక్కడ అగ్రవర్ణాలు సర్పంచులు గా ఉండి గిరిజనులను అణిచివేతకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కావున జనాభా ప్రతిపాదికన 80, 90% శాతం గిరిజనులు ఉన్న అలాంటి గ్రామాలకు ఏజెన్సీ చట్టాన్ని వర్తింపచేసి గిరిజనులకు న్యాయం జరిగేలా చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎస్సీ, ఎస్టీలు ఐక్య పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బానావత్ గోవింద్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు
నందుర్క ముత్తయ్య, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News