ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా.. మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు. దీంతో రామ్‌చరణ్ ఎమోషనల్ అయ్యారు.