KTR: రైతుల్ని అరెస్ట్ చేయడం దారుణం: కేటీఆర్

KTR severely criticizes Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని అన్నారు. రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన వారి అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. రైతులు, సంఘాల నేతలను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమన్నారు. అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందునే ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. 

Spread the love

Related News