Telangana Deputy CM Bhatti Vikramarka in Japan: జపాన్ దేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు జపాన్ దేశంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు జపాన్ చేరుకున్న ఆయనకు హనీడా విమానాశ్రయంలో భారత దేశ రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ స్వాగతం పలికారు. గ్రీన్ హైడ్రోజన్ తో పాటు పలు వ్యాపార కంపెనీలతో భేటీ కానున్నారు. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్తు పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై ఆ దేశ ప్రముఖ కంపెనీల, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. ఆయనతోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు.