Trending Now

Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

​ఇంటి వద్ద హైటెన్షన్​.

రంగంలోకి దిగిన బీఆర్​ఎస్​ నతేలు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో కవితకు ప్రమేయం ఉందంటూ గత ఏడాది కాలంగా ఈడీ విచారణ కొనసాగుతోంది. గతంలో ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన కేసుకు సంబంధించిన విచారణలో పాల్గొన్నారు. అయితే లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించే ఒక రోజు ముందుగా ఢిల్లీ నుంచి ఈడీ, ఐటి అధికారులు హైదరాబాద్​ విచ్చేసి ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్​ వారంటు ఇచ్చిన అనంతరం ఆమెను ఆరెస్ట్​ చేశారు.

హైడ్రామా..

కవితను ఆరెస్టు చేసినట్లు వార్తలు తెలుసుకొన్న బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆమె ఇంటికి చేరుకోవడంతో హైడ్రామా నెలకొంది. ఇప్పటికి కవిత ఇంటిలోపే ఉంది. ఇంటి నుంచి బయటకి ఈడీ అధికారులు తీసుకరాలేదు. ఈడీ అధికారులు ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు ముందుకు వస్తే అక్కడే అడ్డుకునేందుకు బీఆర్​ఎస్​ నేతలు సిద్ధమయ్యారు. పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారు.

Spread the love

Related News

Latest News