ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : అదిలాబాద్ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం గ్రామాలలో ప్రచారాలు జోరాదుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్, జాఫ్రాపూర్ గ్రామాలలో నిర్మల్ జిల్లా మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అల్లూరి కృష్ణవేణి, సీనియర్ నాయకులు మహమ్మద్ మోయినుద్దీన్ ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చేనులలో పంట పొలాలలో ఉన్న వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలు గ్యారెంటీ లపై అవగాహన ఆగస్టు నెలలోపు రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు వినూత్నమైన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందించిన కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళుతున్నదని చెప్పారు.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు సుస్థిర పాలన అందించిన ఘనత గాంధీ కుటుంబాన్నిదని ఇప్పుడు రాబోయే కాలంలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమములో మండల కో ఆప్షన్ సభ్యులు ఫక్రుద్దీన్, సోన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజనర్సింహ రెడ్డి, లక్ష్మి, వాసవి, ముత్తన్న, రమణ,రమేష్ రెడ్డి, భూమ రెడ్డి, భాస్కర్, లింగం ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.