CM Arvind Kejriwal Released From Tihar Jail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు ఆప్ శ్రేణులు, కేజ్రీవాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆప్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నా జీవితం దేశానికే అంకితమన్నారు.
జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, నేను ఎలాంటి తప్పులు చేయనందున ఆ దేవుడి ఆశీసులు ఉన్నాయన్నారు. నన్ను జైలులో పెట్టి నా మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని కొంతమంది అనుకున్నారని, కానీ జైలు నుంచి బయటకు వచ్చాక నేను 100 రెట్లు బలపడినట్లు చెప్పారు. దేశానికి సేవ చేస్తూనే ఉంటానని వెల్లడించారు.