CM Revanth Koti Womens University: హైదరాబాద్లోని కోఠిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఐలమ్మ స్పూర్తిని కొనసాగించాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదన్నారు.
అలాగే, చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సన్మానించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ భూసంస్కరణలు తెచ్చారని సీఎం గుర్తు చేశారు.