ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.