Trending Now

మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారని.. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని తెలిపారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. మెట్రో సెక్టార్ వేరు.. ఇప్పటికీ కూడా మెట్రో లో బోగి లు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. ప్రధాన మంత్రి గారు రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.

బస్సు ప్రయాణం విషయంలో ప్రధాన మంత్రి గారు ఎందుకు అలా మాట్లాడారు.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టంచేశారు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం.. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయన్నారు. ప్రధాన మంత్రి గారు మహిళలకు బస్సు సౌకర్యం పై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలని.. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు.. ఇలా చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దు అని హితవు పలికారు.

మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ అసలు ఏమి మాట్లాడారు..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నిర్ణయంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతోందన్నారు. ‘ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా? లేదా? అనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. ఇలా ఎవరూ ఆలోచించరు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది?’ అని ప్రశ్నించారు.

Spread the love

Related News

Latest News