ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ సాగింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. దర్యాప్తు ముసుగులో సీబీఐ తనను వేధిస్తోందని కేజ్రీవాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు.