Hydra: ‘త్వరలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్’

Hydra Commissioner Ranganath Press Meet: ‘హైడ్రా’ చట్టబద్ధమైనదేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలామంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, జీఓ 99 ద్వారా జులై 19న హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ చివరలోగా ఆర్డినెన్స్ రానున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రాకు మరిన్ని అధికారాలు కూడా రానున్నాయని ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే మరో 6 వారాల తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లు వస్తుందన్నారు. దీంతోపాటు మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని, గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ తెలిపారు.

Spread the love

Related News