ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐదో టెస్ట్‌తో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో ఏడు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్‌వార్న్ తర్వాత ఈ ఘనతను సాధించిన మూడో క్రికెటర్‌గా అండర్సన్ రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీసుకోగా..షేన్‌వార్న్ 708 వికెట్లు దక్కించుకున్నాడు. 700 వికెట్లతో అండర్సన్ మూడో ప్లేస్‌లో చేరుకున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌పై 259 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నది. ఎనిమిది వికెట్ల నష్టానికి 473 రన్స్‌తో మూడో రోజు ప్రారంభించిన టీమిండియా కేవలం నాలుగు పరుగులు మాత్రమే జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.