Trending Now

రాహుల్​ చూపు తెలంగాణా వైపు..! అక్కడి నుంచి పోటీకి రెడీ!

ఖమ్మం నుంచి లోక్​సభకు పోటీ..?

నేడో, రేపో వెలువడనున్న ప్రకటన

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీద ఉన్న కాంగ్రెస్​ మరో రెండింతల ఊపుమీద లోక్​సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసి, అయిదో గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. గత అసెంబ్లీ ఎన్నికలను పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్​ మరింత బలోపేతం అయ్యింది. ఆరో గ్యారంటీ రూ.2లక్షల వ్యవసాయ రుణం ఒకే సారి మాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల ప్రకటించడంతో రైతన్నలు సైతం కాంగ్రెస్​పార్టీకి జయకొట్టనున్నారు.

ఇదిలా ఉంటే త్వరలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది. పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండడంతో తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు పార్టీ ఆగ్రనేత రాహుల్​గాంధీ ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ ఆగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్​గాంధీకి టీపీసీసీ ఆహ్వానించిన విషయం తెలిసిందే!. అయితే సోనియగాంధీ ఇటీవల ఎంపీ నుంచి రాజ్యసభకు ఎన్నికకాగా రాహుల్​గాంధీ మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది తెలియరాలేదు. ఇప్పటికే తెలంగాణాతో పాటు కర్నాటక నుంచి సైతం పోటీ చేయాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్​పార్టీ కూడా కోరినట్లు సమాచారం. అయితే కర్నాటక నుంచి పోటీ చేసేందుకు రాహుల్​ విముకత చూపారని, తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సుముకంగా ఉన్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

Spread the love

Related News

Latest News