హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మరో రెండు లోక్‌సభ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. నాగర్‌కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి అభ్యర్థిత్వాలను బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. త్వరలో మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.