హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాక్ ఇచ్చేశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోనేరు కోనప్ప బుధవారంనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సిర్పూర్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. బీఎస్సీ నేత ప్రవీన్‌కుమార్ సైతం సిర్పూర్ నుంచి పోటీ చేయడంతోనే నేను ఓడిపోయాన్న విషయాన్ని గులాబిబాస్కు కోనప్ప చెప్పినట్లు సమాచారం. అయితే కోనప్ప మాటకు విరుద్దంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోనప్ప బీఆర్ఎస్కు రాజీనామా చేసి త్వరలోనే కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.